మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సంక్రాంతికి అల్లు అర్జున్‌తో కలిసి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించడంతో వసూళ్ళ వర్షం కురుస్తుంది. అయితే తాజాగా ఫిలిం నగర్‌లో త్రివిక్రమ్ తర్వాతి సినిమాకి సంబంధించిన రూమర్ ఒకటి చక్కర్లు కొడుతుంది. 2018లో ఎన్టీఆర్‌తో అరవింద సమేత చిత్రం చేసిన త్రివిక్రమ్ త్వరలో జూనియర్‌తో మరో చిత్రం చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. సమ్మర్‌లో ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళి 2021 సంక్రాంతికి విడుదల చేస్తారని అంటున్నారు. ఈ వార్తపై క్లారిటీ రావలసి ఉంది.
వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్‌తో రానున్న త్రివిక్రమ్..!