బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌లో భాగంగా వెంకటేష్ విసిరిన సవాల్‌ని స్వీకరించిన అనీల్ రావిపూడి తన టాస్క్‌ని పూర్తి చేశాడు. సుత్తి వీరభద్రరరావు నాన్ స్టాప్ డైలాగ్‌ని ముందుగా తన వీడియోలో చూపించిన అనీల్ ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేస్తూ..గిన్నెలు కడుగుతూ, కూరగాయలు కట్ చేసి తన అమ్మకి సాయంగా ఉన్నాడు. ఈ ఛాలెంజ్ ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్. మనకి కొంత ఫన్ అని అనీల్ రావిపూడి తన వీడియోలో పేర్కొన్నాడు.
టాస్క్ పూర్తి చేసిన అనీల్ ఈ ఛాలెంజ్‌ని కొనసాగించాలని తన పటాస్ హీరో కళ్యాణ్ రామ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాజా ది గ్రేట్ హీరో రవితేజని కోరాడు. ఇంట్లో పనులతో అవస్థలు పడే ఆడవాళ్ళకి మనం చేదోడుగా ఉండాలనే ఉద్ధేశంతో సందీప్ రెడ్డి వంగా మొదలు పెట్టిన ఈ టాస్క్ సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది.