లాక్‌డౌన్ వలన ప్రజలందరు ఇళ్ళకే పరిమితం కావడంతో దూరదర్శన్ ఇతిహాసాలకి సంబంధించిన సీరియల్స్‌ని తిరిగి ప్రసారం చేస్తుంది. ఇప్పటికే రామనంద్ సాగర్ రామాయణం ,బిఆర్ చోప్రా మహాభారత్ దూరదర్శన్‌లో ప్రసారం అవుతుండగా, తాజాగా శ్రీకృష్ణ సీరియల్‌ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దూరదర్శన్ నేషనల్ మరియు ప్రసార భారతి తమ అధికారిక ట్విట్టర్ ద్వారా 90లలో ప్రసారమైన పురాణ గాథ శ్రీకృష్ణని తిరిగి ప్రసారం చేయనున్నట్టు పేర్కొంది. రామానంద్ సాగర్ యొక్క 'శ్రీ కృష్ణ' మొదట 1993-1996 మధ్య ప్రసారం చేయబడింది. అప్పట్లో అత్యధిక రేటింగ్ పొందిన ఈ సీరియల్ మొట్టమొదట 1993లో దూరదర్శన్ యొక్క మెట్రో ఛానల్ (డిడి 2) లో ప్రసారం చేయబడింది. ఆపై 1996 లో, డిడి నేషనల్ దీనిని మొదటి నుండి ప్రసారం చేసింది. అనేక ఛానెల్స్‌లో ప్రసారమైన ఈ పాపులర్ సీరియల్ తిరిగి ప్రసారం కాబోతుండడంతో అభిమానులు ఆనందిస్తున్నారు